గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తూ భార్యకు దొరికిపోయిన భర్త

గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తూ భార్యకు దొరికిపోయిన భర్త

ఘజియాబాద్: గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తూ ఓ భర్త తన భార్యకు దొరికిపోయాడు. దీంతో అందరి ముందే భార్య ఆమె భర్తకు దేహశుద్ధి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఘజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో చిన్న గొడవ కావడంతో భార్య తన అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. అయితే కార్వా చౌత్ పండగ కోసం షాపింగ్ కు వెళ్లిన భార్య...  తన భర్త ఇంకొక యువతితో సన్నిహితంగా ఉండటం గమనించింది.

వెంటనే అతడి వద్దకి వెళ్లి ఆ యువతి ఎవరంటూ నిలదీసింది. దీంతో ఖంగుతిన్న భర్త ఏం చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయాడు. విషయం అర్థం చేసుకున్న భార్య.. భర్త కాలర్ పట్టుకొని ఎడపెడా వాయించింది. అయితే భర్తతో వచ్చిన యువతి భార్యను వారించే ప్రయత్నం చేయగా... భార్య  తరఫు బంధువులు అడ్డుకున్నారు. ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ ఇల్లాలు.